News April 13, 2025
MHBD : BRS సిద్ధమా.. పూర్వవైభవం వచ్చేనా..?

రాష్ట్రంలో పదవి కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శ్రేణులతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ దిశానిర్దేశం చేశారు. సభతో BRSలో జోష్ వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.
Similar News
News April 15, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: రాందాసు

ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాసు అన్నారు. జిల్లా పరిధిలోని గ్రామాలలో 14 ఏళ్లలోపు పిల్లలకు 10 శిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించడానికి ఉత్సాహవంతులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 22న కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.
News April 15, 2025
KMR: టీటీడీ ఛైర్మన్‌కు VHP ఆధ్వర్యంలో వినతి

కామారెడ్డి జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సిద్దిరామేశ్వర,కాలభైరవ,లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల అభివృద్ధిని కోరుతూ మంగళవారం తిరుమలతిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.TTD ఛైర్మన్ స్పందిస్తూ దేవాలయాల అభివృద్ధికి అంచనావేసి పరిశీలిస్తామన్నారు. కలిసిన వారిలో కామారెడ్డి VHP నగరాధ్యక్షుడు వెంకటస్వామి,BJP రాష్ట్రనాయకుడు రణజిత్ మోహన్ ఉన్నారు.
News April 15, 2025
చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించింది. అక్రమ రవాణా కేసుల ట్రయల్స్‌ను కోర్టులు 6 నెలల్లోగా పూర్తి చేయాలంది. కాగా 2020 నుంచి 36 వేల మంది చిన్నారులు మిస్ అయ్యారని కేంద్రం గత ఫిబ్రవరిలో కోర్టుకు నివేదిక సమర్పించింది.