News March 27, 2025
MHBD: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని ఆమె అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆమె చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా, నేడు ఢిల్లీలో DCCలతో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News September 17, 2025
రావులపాలెం: జొన్నాడ ఫ్లైఓవర్‌పై సీఎం ఆరా

రావులపాలెం-జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆరా తీశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
News September 17, 2025
చైతన్యపు ఖిల్లా.. మన ఖమ్మం జిల్లా

ఖమ్మంకు ‘చైతన్యపు ఖిల్లా’ అనే పేరు రావడానికి కారణం నాటి తెలంగాణ సాయుధ పోరాటమే. భూస్వాములు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరిగిన ఈపోరాటంలో జిల్లా ప్రజలు ఒడిసెలు, గొడ్డలి వంటి పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకుని పోరాడారు. నల్లమల గిరిప్రసాద్, దేవూరి శేషగిరిరావు, రజబ్ అలీ, మంచికంటి రామకిషన్‌రావు వంటి నేతలు ముందుండి నడిపారు. మీనవోలు, అల్లీనగరం, గోవిందాపురం వంటి గ్రామాలు ఉద్యమానికి ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి.