News March 29, 2025
MHBD: HYDలో దంపతుల తగాదా.. భర్త మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కోబల్ తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోత్ హుస్సేన్ హైదరాబాదులో ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య తగాదా రావడంతో మనస్తాపం చెంది స్వగ్రామానికి చేరుకొని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు.
Similar News
News March 31, 2025
హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.
News March 31, 2025
కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు

విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.
News March 31, 2025
ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.