News January 29, 2025
MHBD: TRSKV నూతన కార్యవర్గం ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి జాన్సన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడు రవికుమార్, రీజినల్ ప్రెసిడెంట్ మోడం వెంకన్న, సెక్రటరీ రాంరెడ్డి, ట్రెజరర్ కేదారి, డివిజన్ అడ్వైజర్ జంపిరావు, ప్రెసిడెంట్ రవీందర్, సెక్రటరీ వీరప్రసాద్, ట్రెజరర్ సంజీవయ్య ఎన్నికయ్యారు.
Similar News
News February 25, 2026
గుంటూరు వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అడ్మినిస్ట్రేటర్, కేసు వర్కర్, కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్యూరిటీ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు స్వశక్తి భవన్‌ను సంప్రదించాలన్నారు.
News February 25, 2026
గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించాలని కోరారు.
News February 25, 2026
VKB: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. వికారాబాద్‌లో 28 పరీక్షా కేంద్రాల్లో 8,384 మంది 1st ఇయర్, 8,006 మంది 2nd ఇయర్ విద్యార్థులు రాయనున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు తదితరాలు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
ALL THE BEST


