News February 2, 2025
MHBD: అంగన్వాడీ ఆయాలకు శుభవార్త
టెన్త్ పాస్ అయినా ఆయాలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు గణపురపు అంజయ్య అన్నారు. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియమితులైన వారికి ప్రమోషన్ కల్పించాలని CM రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆయాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.
Similar News
News February 2, 2025
MDK: రోగులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య అధికారులను ఆదేశించారు. రామాయంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఫార్మసి గది, రక్త పరీక్షలు ల్యాబ్, ఇన్ పేషెంట్స్ వార్డు, మందుల నిలువ స్టోర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రి నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
News February 2, 2025
నరసాపురం ఎమ్మెల్యే కారుకి ప్రమాదం
మచిలీపట్నం దగ్గర నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం ప్రమాదం తప్పింది. కారుకు బైక్ అడ్డుగా రావడంతో తప్పించే క్రమంలో అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
News February 2, 2025
BHPL: రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్
రేపటి నుంచి జిల్లాలోని వివిధ శాఖలతో క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు పోలీసు అధికారులు సిబ్బందికి పలు క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ క్రీడలు ఈ నెల 3 నుంచి 6 వరకు కొనసాగనున్నాయని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అంబేడ్కర్ స్టేడియంతో పాటు కాకతీయ స్టేడియంలో జరగనున్నాయని చెప్పారు.