News March 5, 2025
MHBD: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: SP

MHBD జిల్లా కేంద్రంలో బుధవారం జరగనున్న ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల 163 BNNS(144సెక్షన్) అమలులో ఉండనుందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈనెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News March 6, 2025
సింగిల్స్‌లో ‘కింగ్’.. కోహ్లీ

క్రికెట్‌లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్‌లో ఓ బ్యాటర్‌కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.
News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.
News March 6, 2025
సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.