News April 9, 2024

MHBD: ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు

image

మహబూబాబాద్ పట్టణ ప్రజలు ఈ నెల 30వ తేదీలోగా ఇంటి పన్ను చెల్లిస్తే 5 శాతం మినహాయింపు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణ ప్రజలు 2024-25 సంవత్సరం ఇంటి పన్ను నంబర్, పాత డిమాండ్ నోటీస్‌తో గాని చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించవచ్చన్నారు.

Similar News

News December 29, 2024

నల్లబెల్లి: అక్కడా, ఇక్కడా ఒకటే పులి

image

నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో నిన్న గ్రామస్థులకు పులి కనిపించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తగూడ, నల్లబెల్లిలో సంచరించిన పులి ఒకటేనని వారు స్పష్టం చేశారు. కాగా, నల్లబెల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. శనివారం ఓ మహిళకు, పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది.

News December 29, 2024

పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి: డీఐఈఓ

image

మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.

News December 28, 2024

జనగామ: హెల్ప్ లైన్ నంబర్లపై విద్యార్థులకు అవగాహన 

image

జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు.