News February 15, 2025

MHBD: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

image

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్‌జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు MHBD జిల్లాకు చెందిన 52 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.

Similar News

News March 14, 2025

GWL: మరమ్మత్తుల కంటే.. కొత్త మోటర్లు బెటర్.!

image

GWL జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకు నీటి వసతి కల్పించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నాయి. వేసవి కాలం మొదలైతే నీటి వనరులు అడుగంటి మోటర్లు స్టార్టర్లు పనిచేయవు. పాత వాటికీ మరమ్మతులు చేయించిన కొన్ని రోజులకే పాడౌతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం పదే పదే రిపైర్స్ అయ్యే వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News March 14, 2025

పర పురుషులతో భార్య సెక్స్‌చాట్‌ను ఏ భర్తా భరించలేడు: హైకోర్టు

image

భార్య తన సెక్స్ లైఫ్ గురించి పరపురుషులతో చాటింగ్ చేస్తే ఏ భర్తా భరించలేడని MP హైకోర్టు తెలిపింది. ‘పెళ్లయ్యాక దంపతులు మొబైల్లో తమ మిత్రులతో అనేక అంశాలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఆ సంభాషణలు గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి అపోజిట్ జెండర్‌తోనైతే జీవిత భాగస్వామి గురించి అస్సలు అభ్యంతరకరంగా ఉండొద్దు’ అని పేర్కొంది. ఆ భార్య సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కుటుంబ కోర్టు మంజూరు చేసిన విడాకులను ఆమోదించింది.

News March 14, 2025

జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

image

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

error: Content is protected !!