News March 14, 2025
MHBD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

MHBDలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News March 14, 2025
రేపటి నుంచి ఒంటిపూట అంగన్వాడీ కేంద్రాలు

TG: అంగన్వాడీ కేంద్రాలను రేపటి నుంచి ఒంటిపూట నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. అటు పాఠశాలలు కూడా రేపటి నుంచి ఒంటిపూట నడవనున్నాయి.
News March 14, 2025
మంచిర్యాల: PHOTO OF THE DAY

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.
News March 14, 2025
ఆసిఫాబాద్: PHOTO OF THE DAY

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.