News April 5, 2025

MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి  ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 5, 2025

మునక్కాయల వల్ల ఎన్ని ప్రయోజనాలో.!

image

ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సీజనల్ ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను నియంత్రిస్తాయి. వీటిని తినటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ‌మగవారిలో శృంగార సామర్థ్యానికి దోహదపడతాయి. వీటిలో ఉండే జింక్ ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేలా సహకరిస్తుంది.

News April 5, 2025

రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

image

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News April 5, 2025

‘ఎంపురాన్’ డైరెక్టర్‌‌కు ఐటీ నోటీసులు

image

మోహన్‌లాల్ నటించిన L2 ఎంపురాన్ డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2022లో ఆయన నటించి, సహ నిర్మాతగా వ్యహరించిన 3 సినిమాల వల్ల పొందిన ఆదాయ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈనెల 29 వరకు సుకుమారన్‌కు గడువు విధించింది. కాగా 2022లోనూ పృథ్వీరాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మరోవైపు నిన్న ఎంపురాన్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది.

error: Content is protected !!