News February 7, 2025

MHBD: మానవత్వం పరిమళించిన వేళా!

image

మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన విశ్రుతప్రియాన్సిని అనే చిన్నారి క్యాన్సర్ సంబంధింత వ్యాధితో బాధడుతుండగా.. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయాల్సి ఉంది. చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక స్థోమతకు మించి వైద్యం చేయించారు. ఇకపై వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో దాతల సహాయం కోరారు. ఈ క్రమంలో పట్టణ కేంద్రానికి చెందిన షకీల్ అనే వ్యక్తి స్పందించి రూ.50 ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

Similar News

News February 7, 2025

కంకిపాడులో యువకుడి సూసైడ్

image

కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News February 7, 2025

కశింకోటలో కిలో బెండ రూ.100

image

బెండకాయల ధర గణనీయంగా పెరిగింది. గురువారం కశింకోట వారపు సంతలో కిలో రూ.100 చొప్పున విక్రయాలు జరిగాయి. కాగా వంకాయలు, టమాటా ధరలు మాత్రం తగ్గాయి. గతవారం కిలో రూ.20 ఉన్న టమాటా ఈ వారం రూ.15కు తగ్గింది. గతవారం 80 రూపాయలకు అమ్మిన వంకాయల ధర రూ.30కి పడిపోయింది. ఉల్లి, బంగాళదుంప ధరలు కిలో రూ.40, బీట్ రూట్, బీన్స్ రూ.50కి విక్రయించారు.

News February 7, 2025

SKLM: రహదారి నిర్మాణానికి రూ.45.50 కోట్లు మంజూరు

image

వెంకటాపురం నుంచి సంతబొమ్మాలి మండలం నౌపడ రహదారి నిర్మాణానికి రూ.45 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు సామాజిక కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు గురువారం తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. 

error: Content is protected !!