News April 21, 2025
MHBD: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ మహబూబాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు TGMREIS వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.
Similar News
News April 21, 2025
తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)
News April 21, 2025
సిద్దిపేట: ప్రజావాణికి 44 దరఖాస్తులు

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News April 21, 2025
BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

AP: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.