News April 7, 2025
MI vs RCB: కోహ్లీకి ఆ వెలితి తీరేనా?

IPLలో భాగంగా మరికాసేపట్లో ముంబై, బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ముంబైతో జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంతవరకూ ఎప్పుడూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోలేదు. దాదాపు 30-40 మ్యాచులు ఆడినా ఒక్కసారి కూడా అతడిని POTM వరించలేదు. 92*, 82*, 82* వంటి భారీ స్కోర్లు చేసిన మ్యాచుల్లోనూ ఆయనకు ఈ అవార్డు రాలేదు. ఈసారైనా ఆ వెలితి తీర్చుకోవాలని ఛేజ్‌మాస్టర్ భావిస్తున్నారు.
Similar News
News April 8, 2025
చైనాను హెచ్చరించిన ట్రంప్

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్‌లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.
News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
News April 7, 2025
బీజేపీ సంచలనం.. విరాళాల్లో టాప్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలు పొందిన విరాళాలను ADR వెల్లడించింది. అన్ని పార్టీలకు రూ.2544.27 కోట్ల ఫండ్స్ రాగా, అందులో ఒక్క బీజేపీకే రూ.2,243 కోట్లు వచ్చాయి. మొత్తం విరాళాల్లో ఆ పార్టీకే 88శాతం వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.281.48 కోట్ల విరాళం పొందింది. AAP, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువ విరాళాలు రాగా, తమకు విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించింది.