News September 16, 2024
మైఖేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత

మైఖేల్ జాక్సన్ సోదరుడు, ‘ది జాక్సన్ 5’ పాప్ బ్యాండ్ సభ్యుడు టిటో జాక్సన్(70) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హార్ట్ అటాక్‌తో చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పలు మ్యూజికల్ ఈవెంట్స్‌తో పాపులరైన ఆయన జాక్సన్ కుటుంబానికి చెందిన 10 మంది సంతానంలో మూడోవాడు. కెరీర్లో 3సార్లు గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన ఆయన రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
Similar News
News March 11, 2025
FLASH: గ్రూప్-2 ఫలితాలు విడుదల

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <
News March 11, 2025
సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.
News March 11, 2025
ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.