News July 2, 2024
శ్రీలంకతో సిరీస్‌కు మైకేల్ వాన్ కుమారుడు

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కుమారుడు ఆర్కీ వాన్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆర్కీ టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు స్పిన్ కూడా వేయగలరు. అలాగే ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కుమారుడు రాకీ ఫ్లింటాఫ్, జో డెన్లీ అల్లుడు జైడెన్ డెన్లీ, రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నారు.
Similar News
News January 19, 2026
రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.
News January 19, 2026
హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు… అప్లై చేశారా?

హైదరాబాద్‌లోని <
News January 19, 2026
గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.


