News August 13, 2024
పెయింట్-3Dని ఆపేస్తున్న మైక్రోసాఫ్ట్

పెయింట్-3డీని ఈ ఏడాది నవంబరు తర్వాతి నుంచి ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. తొలిసారిగా విండోస్-10లో దీన్ని సంస్థ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చాలా తక్కువమంది దాన్ని వాడటం, వేరే అప్లికేషన్లను ప్రవేశపెట్టే ఆలోచన ఉండటంతోనే నిలిపివేస్తున్నట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం వాడుతున్న వారికి యథావిధిగా పనిచేస్తుందని, నవంబరు నుంచి కొత్తగా అప్డేట్స్ లేదా డౌన్‌లోడ్స్‌కు వీలు ఉండదని తెలిపింది.
Similar News
News November 11, 2025
క్లౌడ్ స్కిన్ మేకప్ గురించి తెలుసా?

మేకప్ ఇప్పుడు ప్రతి అమ్మాయి రొటీన్లో భాగమైపోయింది. వాటిల్లో కొత్తగా వచ్చిందే ఈ క్లౌడ్ స్కిన్ మేకప్. అన్నిరకాల చర్మతత్వాలకు సరిపడే ఈ మేకప్‌లో ముందుగా సీరమ్, తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పోర్ బ్లరింగ్ ప్రైమర్, ఫౌండేషన్ అద్దుకోవాలి. తర్వాత బ్లష్, మ్యాట్ ఫినిష్ బ్రాంజర్ రాసుకోవాలి. అంతే మ్యాట్ ఫినిష్‌తో వచ్చే మేకప్ పూర్తయినట్లే. మ్యాట్ ఫినిష్ లిప్‌స్టిక్ వేసుకుంటే ఇంకా బావుంటుంది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్.. 20.76శాతం పోలింగ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76శాతం ఓటింగ్ నమోదైంది. మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో రీప్లేస్ చేసినట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అటు నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో తిరుగుతున్న ముగ్గురు నాన్‌లోకల్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు బిహార్‌లో ఉ.11 గంటల వరకు 31.38శాతం పోలింగ్ నమోదైంది.
News November 11, 2025
అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, సీనియర్ అధికారులు హాజరయ్యారు. J&K డీజీపీ వర్చువల్‌గా పాల్గొంటున్నారు.


