News July 19, 2024

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్: నిలిచిన విమానాలు, పలు వ్యవస్థలు

image

<<13660202>>మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య కారణంగా<<>> ప్రపంచవ్యాప్తంగా పలు సేవలు స్తంభించాయి. ఆ సంస్థకు సైబర్ భద్రత అందించే ‘క్రౌడ్‌స్ట్రైక్’ వేదిక వైఫల్యమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Similar News

News January 23, 2025

వారికి ఖాన్స్ కావాలి.. హిందూ నటులను పట్టించుకోరు: BJP నేత

image

బంగ్లాదేశీయుడు నిజంగానే సైఫ్‌ను కత్తితో పొడిచాడా లేక ఆయన యాక్ట్ చేస్తున్నారా అని MH మంత్రి నితేశ్ రాణె ప్రశ్నించారు. పరిస్థితుల్ని గమనిస్తే డౌట్ వస్తోందన్నారు. ‘చూస్తుంటే షరీఫుల్‌ను సైఫ్ స్వయంగా స్వాగతించినట్టు అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకేమో ఖాన్ యాక్టర్స్ తప్ప హిందూ నటులపై జాలి ఉండదు. సుశాంత్‌ గురించి సుప్రియా, జితేందర్ ఎప్పుడైనా అడిగారా? సైఫ్, షారుఖ్ కొడుకునైతే పట్టించుకుంటారు’ అని అన్నారు.

News January 23, 2025

సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు

image

AP: మాజీ సీఎం YS జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు చెందిన సరస్వతీ పవర్, ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మాచవరం(మ) వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల దస్తావేజులను రద్దు చేస్తున్నట్లు తహశీల్దార్ ప్రకటించారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు భూముల్లో సర్వే చేసి GOVT భూములను గుర్తించారు.

News January 23, 2025

పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

image

TG: రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా మధ్యాహ్నం ఎండ దంచుతోంది. ఉదయం 9 గంటలైనా పొగమంచుతో కూడిన చలి ఉంటోంది. సాయంత్రం 6 అయితే చాలు ఉష్ణోగ్రతలు పడిపోయి గజగజ మొదలవుతోంది. చాలా జిల్లాల్లో 10 డిగ్రీలలోపు టెంపరేచర్ నమోదవుతోంది. ఇక మధ్యాహ్నం ఎండ సుర్రుమంటోంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఈ భిన్న వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.