News January 4, 2025
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు రూ.85.84కోట్లు కేటాయించింది.
Similar News
News November 20, 2025
వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.
News November 20, 2025
ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.
News November 20, 2025
బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్రూమ్.. అసలు తేడా ఏంటి?

బాత్రూమ్, వాష్‌రూమ్, రెస్ట్రూమ్ పదాలకు వేర్వేరు అర్థాలతో పాటు వీటి వినియోగం కూడా భిన్నంగా ఉంటుంది. బాత్రూమ్ అనేది ఇంటిలో ఉండే వ్యక్తిగత గది. ఇందులో టాయిలెట్‌తో పాటు షవర్ లేదా బాత్‌టబ్ ఉంటుంది. వాష్‌రూమ్‌లో స్నానం చేసేందుకు సౌకర్యం లేకపోయినా టాయిలెట్, సింక్ ఉంటాయి. ఇవి ఆఫీసులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఉంటాయి. రెస్ట్రూమ్ మరింత ఫార్మల్గా, చిన్న విరామానికి అనుకూలంగా ఉంటుంది.


