News January 28, 2025

స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. విద్యా కమిషన్ సూచనలివే!

image

TG: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను రూ.2 పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. వంట సహా తాగేందుకు బోర్ నీళ్లకు బదులు మిషన్ భగీరథ నల్లా నీళ్లు వాడాలని పేర్కొంది. భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్‌పై వండించాలని సూచించింది.

Similar News

News October 17, 2025

భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

image

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

News October 17, 2025

అన్నింటా రాణిస్తున్న అతివలు

image

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్​లోని జాతీయ పోలీస్​ అకాడమీలో 77వ రెగ్యులర్​ రిక్రూట్​ బ్యాచ్​లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్​ పోలీస్​ సర్వీస్​ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్‌లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.

News October 17, 2025

23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

image

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్‌కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.