News April 12, 2024

ఉపాధి కోసం వలస వెళ్తున్నారు: చంద్రబాబు

image

AP:రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘అమరావతి పూర్తైతే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత HYD, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్. నా SCలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారు. నాసిరకం మద్యంతో అనేక మంది చనిపోతున్నారు. 5 ఏళ్లలో పోలవరం ఎంత పూర్తైంది? రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు 3 రాజధానులు ఎలా కడతారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News April 2, 2026

నిట్కాన్‌ లిమిటెడ్‌లో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిట్కాన్‌ లిమిటెడ్, ఢిల్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సివిల్‌‌లో 80, ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌‌ల్లో 20 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్‌ డిప్లొమాతో పాటు 3 ఏళ్ల పని అనుభవం, ఇంజినీరింగ్‌‌తో పాటు ఏడాది ఉద్యోగ అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 08.04.26 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం nitcon.org చూడండి.

News April 2, 2026

ఫుట్‌బాల్ WC ఫైనల్ టికెట్ ధర ₹10 లక్షలు

image

ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జులై 19న న్యూజెర్సీలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్‌ కోసం టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా $10,990గా (సుమారు ₹10.22 లక్షలు) నిర్ణయించింది. ఒక్క మ్యాచ్ టికెట్‌తో ఇండియాలో కారు కొనొచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జూన్ 11న మెక్సికోలో మొదలయ్యే ఈ సాకర్ పండగలో మొత్తం 48 జట్లు తలపడనున్నాయి.

News April 2, 2026

రేపు జాగ్రత్త: APSDMA

image

AP: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDMA వెల్లడించింది. 42-43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ గరిష్ఠంగా విజయనగరం జిల్లా రాజాంలో 40.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది.