News November 25, 2024
మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్
TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.
Similar News
News November 25, 2024
పెన్షన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
AP: డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించింది. 30వ తేదీన పెన్షన్ పంపిణీ పూర్తవకపోతే డిసెంబర్ 1న లేదా 2న పూర్తి చేయనున్నారు. కాగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం రూ.4000 పెన్షన్ ఇస్తోంది.
News November 25, 2024
ప్రధాని విశాఖ టూర్ రద్దు
AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖ టూర్ రద్దయ్యింది. ఏపీకి భారీ వర్షసూచన నేపథ్యంలో టూర్‌ను రద్దు చేసిన PMO ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో రద్దైతే గ్రీన్ ఎనర్జీ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 3రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే.
News November 25, 2024
ఓనర్ లేకుండా షాప్స్.. ఏవైనా తీసుకోవచ్చు!
రోడ్డు వెంబడి దుకాణాలున్నా అందులో ఒక్కరూ కనిపించరు. మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఇలాంటి ప్లేస్ ఎక్కడుందని అనుకుంటున్నారా? మిజోరంలోని సెలింగ్ హైవే వెంబడి ఇలాంటి అనేక షాప్స్ ఉన్నాయి. షాప్స్‌లో ఉన్న వస్తువులను మీరు తీసుకొని డబ్బులను అక్కడే ఉన్న డబ్బాలో వేస్తే సరిపోతుంది. అక్కడి ప్రజలు ఇతరులపై ఎంతో విశ్వాసం కలిగి ఉండటమే దీనికి కారణం. దీనిని ‘నఘా లౌ డావర్ కల్చర్ ఆఫ్ మిజోరం’ అని పిలుస్తారు.