News March 25, 2025
బంగ్లాలో సైనిక తిరుగుబాటు?

బంగ్లాదేశ్లో సైనిక తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూనస్ పట్ల బంగ్లా సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8మంది మేజర్ జనరల్స్, కమాండర్స్, కీలక అధికారులతో ఆర్మీ చీఫ్ వకెర్-ఉజ్-జమాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో తిరుగుబాటు వార్తలు ఊపందుకున్నాయి.
Similar News
News March 28, 2025
కార్యకర్తలకు హ్యాట్సాఫ్: YS జగన్

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో CBN అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ MPTCలు, ZPTCలు YCP అభ్యర్థులను గెలిపించుకున్నారని YS జగన్ కొనియాడారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు.
News March 28, 2025
మద్యం తాగేటప్పుడు చికెన్ తింటున్నారా?

చాలామంది మద్యం తాగేటప్పుడు స్టఫ్లో చికెన్ తినడానికి ఇష్టపడతారు. అలా అయితేనే ‘కిక్కు’ అంటారు. కానీ చికెన్లో అధికంగా ఉండే కొవ్వు.. ఆల్కహాల్తో కలిసి జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఫ్యాటీలివర్కు దారి తీస్తుంది. ఆల్కహాల్తో కొవ్వు ఆహారం తీసుకునేవారిలో 30% మందికి కాలేయ సమస్యలు వచ్చినట్లు ఓ అధ్యయనంలో తేలింది. తక్కువ మసాలా, నూనె లేని గ్రిల్డ్ చికెన్ 100-150 గ్రా. తీసుకోవడం ఉత్తమం.
News March 28, 2025
పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను: రకుల్

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.