News December 4, 2024

భార్య కోసమే సైనిక పాలన..?

image

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య‌ కిమ్ కియోన్-హీ ర‌క్షించ‌డానికే ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సైనిక పాల‌న విధించిన‌ట్టు తెలుస్తోంది. కిమ్‌పై దర్యాప్తునకు విపక్ష డెమోక్ర‌టిక్ పార్టీ(DP) ప్రయత్నిస్తోంది. మరోవైపు అధికార పార్టీ తెచ్చిన బ‌డ్జెట్‌ను DP తిర‌స్క‌రించింది. నేష‌న‌ల్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్న DP నిర్ణయాన్ని అధ్య‌క్షుడు రద్దు చేయ‌లేరు. ఈ పరిణామాల నేప‌థ్యంలో యూన్ సైనిక పాల‌న విధించారు.

Similar News

News January 20, 2026

ప్రకాశం జిల్లాలో మద్యం లైసెన్స్‌‌కు దరఖాస్తులు

image

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగినవారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 20, 2026

ఈ ఐదుగురు మిత్రులు మీతో ఉన్నారా?

image

మనకు 5 రకాల స్నేహితులు తోడుగా ఉండాలి. నిత్యం దైవ లీలలను స్మరిస్తూ మనల్ని నవ్వించే ‘విదూషకుడు’, ధర్మమార్గంలో నడిపిస్తూ జీవిత పాఠాలు నేర్పే ‘మార్గదర్శి’, క్లిష్ట సమయాల్లో త్వరిత నిర్ణయాలు తీసుకునే ‘ధైర్యశాలి’ ఉండాలి. మన భక్తిలోని లోపాలను ప్రశ్నించి సరిదిద్దే ‘పృచ్ఛకుడు’, మనపై పూర్తి నమ్మకంతో దైవకార్యాల్లో అండగా నిలిచే ‘విశ్వాసి’ వంటి మిత్రులు ఉండాలి. ఇలాంటివారు మీకుంటే అది నిజంగా దైవానుగ్రహమే.

News January 20, 2026

CSLలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(<>CSL<<>>)లో 3 Jr. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BCA, PGDCA, BSc(ఎలక్ట్రానిక్స్/ CS), డిప్లొమా( కంప్యూటర్ Engg.) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(అబ్జెక్టివ్ టైప్, డిస్క్రిప్టివ్ టైప్) ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.42,773 చెల్లిస్తారు.