News December 3, 2024

సౌత్ కొరియాలో సైనిక పాలన

image

దేశంలో సైనిక అత్యవసర పరిస్థితి (సైనిక పాలన) విధిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్ ప్రకటించారు. ఉత్తర కొరియా దాడుల భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా దేశంలోని ప్రతిపక్షాలు ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉన్నాయని యోల్ ఆరోపిస్తున్నారు. దేశ అంతర్గత, బహిరంగ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మరో మార్గం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే చీఫ్ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

Similar News

News March 12, 2026

BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,090 తగ్గి రూ.1,62,220కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,000 పడిపోయి రూ.1,48,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.10వేలు తగ్గి రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 12, 2026

భారత్‌పై మళ్లీ టారిఫ్స్‌.. రెడీ అవుతున్న ట్రంప్?

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయనే ఆరోపణలతో భారత్, చైనా సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన అదనపు టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విచారణ ఆయా దేశాలు అమెరికా విషయంలో అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారిస్తే మళ్లీ టారిఫ్స్ వేయడం లేదా ఇతర ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

News March 12, 2026

ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

image

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.