News March 6, 2025
మిల్లర్ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి పరార్!

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విచిత్రమైన సంఘటన జరిగింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్సర్ కొట్టారు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీసీ ఈవెంట్లో ఇలా జరగడం మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టీమ్‌ను గెలిపించేందుకు మిల్లర్ చేసిన పోరాటం అనిర్వచనీయమని నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.
Similar News
News March 6, 2025
సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?
News March 6, 2025
ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
News March 6, 2025
ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.