News June 5, 2024
ఈ ఎన్నికల్లో కోటీశ్వరులదే హవా!

ఈ లోక్సభ ఎన్నికల్లో కోటీశ్వరుల హవా కొనసాగింది. దేశవ్యాప్తంగా 2,573 మంది కోటీశ్వరులు బరిలో నిలవగా 503 మంది ఎంపీలుగా గెలుపొందారు. 4,013 మంది గ్రాడ్యుయేట్లు పోటీ చేయగా వారిలో 391 మంది విజయం సాధించారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 1643 మందిపై పలు కేసులు ఉండగా వారిలో 250 మంది ఎంపీలుగా గెలిచారు. ఇక 324 మంది సిట్టింగ్ ఎంపీలు మరోసారి పోటీ చేయగా 213 మంది గెలుపొందారు.
Similar News
News November 10, 2025
ప్రకృతి సేద్యం.. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.
News November 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,12,950 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,67,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


