News July 28, 2024

MIM నేతలు గోడ మీద పిల్లులు: బండి సంజయ్

image

TG: ఎంఐఎం అవకాశవాద పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ పార్టీ నేతలు గోడ మీద పిల్లుల లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘ఎంఐఎం నేతలు ఎవరు అధికారంలో ఉంటే వారి పక్కన చేరతారు. రేవంత్, అక్బరుద్దీన్ అన్నదమ్ములలాంటివారు. అందుకే అక్బర్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం అంటున్నారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్‌లో పోటీ చేయాలి. పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు రాకుండా చేస్తాం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News January 28, 2026

అజిత్ మరణం వెనుక కుట్ర లేదు: శరద్ పవార్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఎన్సీపీ అధినేత, ఆయన పెద్దనాన్న శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సూచించారు. ఇది పూర్తిగా ఓ యాక్సిడెంట్ అని పేర్కొన్నారు. కాగా అజిత్ మరణంలో కుట్ర కోణం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News January 28, 2026

అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. దీంతో 3 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్ కానున్నాయి. రేపు 11amకు పవర్ అంత్యక్రియలు నిర్వహించనుండగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు అజిత్ మృతదేహం ఉన్న బారామతి ఆస్పత్రి వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.

News January 28, 2026

అమిత్ షాతో పవన్ భేటీ

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను చర్చించామని ఆయన ట్వీట్ చేశారు. ఉప్పాడ తీరంలో గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ పవన్ కలిశారు. కాసేపట్లో విశాఖకు బయల్దేరనున్నారు.