News August 15, 2024
నాది రెడ్ బుక్ కాదు.. ఓపెన్ బుక్: లోకేశ్

AP: రెడ్ బుక్‌పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చారు. తనది రెడ్ బుక్ కాదని, ఓపెన్ బుక్ అని ట్వీట్ చేశారు. ‘ఫేకు జగన్ నీలా నాపై కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీలా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలకు వెళ్లా. జనాలు కొట్టిన స్లిప్పర్ షాట్ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. చిల్ బ్రో’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
అప్పుడు తప్పు అని.. ఇప్పుడవే అప్పులా: బుగ్గన

AP: ఏపీబీసీఎల్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లను గతంలో విమర్శించిన CBN ఇప్పుడు వాటినే ఎలా జారీ చేస్తున్నారని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ‘18 నెలల్లో ₹2.66 లక్షల CR అప్పు చేశారు. ఉద్యోగులకు జీతాలూ సరిగా ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పంతా ఏమౌతోంది?’ అని నిలదీశారు. లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, మార్జిన్ ఆదాయాన్ని కూడా ఎస్క్రో అకౌంట్‌కు లింకు చేస్తున్నారని మండిపడ్డారు.
News December 14, 2025
ఇంటి వద్ద పారిజాత పుష్పాన్ని పెంచవచ్చా?

ఇంటి ఆవరణంలో పారిజాతం మొక్క పెంచడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది సానుకూల శక్తిని, శాంతిని ఆకర్షిస్తుందని అంటున్నారు. ‘సాక్షాత్తూ లక్ష్మీదేవి ఈ చెట్టులో నివసిస్తుందని, ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఈశాన్యంలో నాటడం శ్రేయస్కరం. ఇది దుష్ట శక్తులను తొలగించి, కుటుంబంలో ఐక్యత, ప్రేమను పెంచుతుంది. ఆరోగ్యపరంగానూ లాభాలుంటాయి’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,500కు పైగా, BRS 800, BJP 200 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 440 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో BRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.


