News August 11, 2025
మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం: RBI

బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.50,000 పెంచుతూ ICICI తీసుకున్న <<17349792>>నిర్ణయంపై <<>>విమర్శలొస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ‘కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని బ్యాంకులు రూ.10,000 ఫిక్స్ చేస్తాయి. మరికొన్ని రూ.2,000 ఉంచుతాయి. మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఇది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News August 11, 2025
వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్?

సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్ అవుతుండటంతో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అతడిని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి NCA స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. T20, వన్డేలకు వైభవ్ అటాకింగ్ స్టైల్ చక్కగా సరిపోతుందని భావిస్తోందట. దీర్ఘ దృష్టితో అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News August 11, 2025
AI భయం.. ఉద్యోగం భద్రమేనా?

AI ఎంట్రీతో టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తుండటంతో తమ జాబ్ ఉంటుందో ఊడుతుందోనని IT ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ అని గర్వంగా చెప్పిన గొంతులు నేడు బొంగురుపోయే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులు ఆగిపోవడం, తొలగింపులు పెరగడంతో ఉద్యోగ భద్రత, AI ప్రభావంపై చర్చ మొదలైంది. ఇది తాత్కాలికమా? మళ్లీ పునర్వైభవం వస్తుందా? అంటూ తమ భవిష్యత్తుపై ఉద్యోగులు బెంగపెట్టుకుంటున్నారు.
News August 11, 2025
ధనుష్‌తో డేటింగ్.. స్పందించిన మృణాల్ ఠాకూర్

కోలీవుడ్ హీరో ధనుష్‌తో <<17307114>>డేటింగ్ రూమర్స్<<>>పై స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఈ రూమర్స్ గురించి నాకు బాగా తెలుసు. ఈ రూమర్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. ధనుష్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మేం ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్య ఏదో ఉన్నట్లు కాదు. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ ఈవెంట్‌కు ఆయన రావడాన్ని అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.