News January 21, 2025
మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News January 21, 2025
మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. కీలక అప్డేట్
TG: ఈనెల 26 నుంచి ‘<<15192924>>ఇందిరమ్మ ఆత్మీయ భరోసా<<>>’ అమలు కానున్న విషయం తెలిసిందే. 2023-24లో ఉపాధి హామీ స్కీమ్‌లో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలుంటే వారిద్దరిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్లో నగదు వేస్తారు.
News January 21, 2025
క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!
TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్కౌంటర్లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.
News January 21, 2025
నేడు KRMB కీలక సమావేశం
కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ.11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.