News February 5, 2025

కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం

image

TG: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో భానుడి భగభగలు తప్పవని హెచ్చరించింది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు బయటకి వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఈ మూడ్రోజులు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News September 16, 2025

సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

image

ఆసియా కప్‌ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్‌ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్‌ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.

News September 16, 2025

కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

image

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.

News September 16, 2025

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

image

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.