News March 26, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాల్సిందే: హైకోర్టు

image

AP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సవరించిన పే స్కేల్‌ను 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. బకాయిల మొత్తాన్ని 12 వారాల్లో చెల్లించాలని పేర్కొంది. అయితే కేజీబీవీల్లోని బోధనా సిబ్బంది బదిలీలను నిలుపుదల చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

Similar News

News April 20, 2025

విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు: కేశినేని చిన్ని

image

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

News April 20, 2025

రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

image

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.

News April 20, 2025

IPL: ముగిసిన సీఎస్కే బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే..

image

MIvsCSK మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. దూబే(50), జడేజా (53*) రాణించారు. ధోనీ 4 పరుగులకే ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా 2, చాహర్, అశ్వని, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై విజయ లక్ష్యం 177 రన్స్.

error: Content is protected !!