News October 17, 2024

సూపర్ మార్కెట్‌లో ధరలపై మంత్రి ఆగ్రహం

image

AP: మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్, సూపర్ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ధరలు, స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. సూపర్ మార్కెట్‌లో కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం రాయితీపై రేషన్ షాపుల్లో ఉల్లి, టమాటా, కందిపప్పు, నూనె అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 18, 2024

ఈ నెల 21న దక్షిణ కొరియాకు మంత్రులు, ఎమ్మెల్యేలు

image

TG: మూసీ పునరుజ్జీవం కోసం అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. స్థానికంగా రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

News October 18, 2024

భారత్ టాస్ మాత్రమే గెలిచి అంతా ఓడింది: అజయ్ జడేజా

image

న్యూజిలాండ్‌తో టెస్టులో భారత్ ఆడిన విధానంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు గుప్పించారు. మ్యాచ్‌లో టాస్ గెలవడం ఒకటే భారత్ చేసిన మంచి పని అని తేల్చిచెప్పారు. ‘రెండో రోజు టాస్ తప్ప మిగిలిన ఆటంతా భారత్ ఓడింది. బౌలింగ్‌పరంగా ఫర్వాలేదనిపించారు కానీ బ్యాటింగ్ నిర్లక్ష్యంగా, ఫీల్డింగ్ నీరసంగా కనిపించింది. బ్యాటర్లు వికెట్లను చేజేతులా సమర్పించుకున్నారు’ అని విమర్శించారు.

News October 18, 2024

మా దేశానికి పీఎం మోదీ వచ్చి ఉంటే బాగుండేది: షరీఫ్

image

పాకిస్థాన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి భారత PM మోదీ వచ్చి ఉంటే బాగుండేదని పాక్ మాజీ PM నవాజ్ షరీఫ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘వారి మంత్రి పర్యటనతోనైనా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశిస్తున్నాం. మన మధ్య సమస్యల్ని కలిసి పరిష్కరించుకోవాలి. శాంతిచర్చలు కొనసాగాలి. 75 ఏళ్లు ఇలాగే వృథా అయ్యాయి. మరో 75 ఏళ్లు మనం వృథా చేయకూడదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలుండాలి’ అని కోరారు.