News December 30, 2024
మంత్రి అచ్చెన్నాయుడు గొప్ప మనసు
AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News January 2, 2025
సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం
AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News January 1, 2025
BGT: చివరి టెస్టుకు వర్షం ముప్పు
BGTలో భాగంగా సిడ్నీ వేదికగా ఎల్లుండి నుంచి జరిగే చివరి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వెదర్ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ రద్దయినా, డ్రా అయినా ఆసీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. మ్యాచ్లో రోహిత్ సేన గెలిస్తే కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండులో ఇరు జట్ల మధ్య 13 మ్యాచ్లు జరగగా IND ఒక్కటే గెలిచింది. 5 ఓడిపోగా, 7 డ్రాగా ముగిశాయి.
News January 1, 2025
రాష్ట్రంలో మరో పోలీస్ కానిస్టేబుల్ సూసైడ్
తెలంగాణలో వరుస పోలీసుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYD ఫిల్మ్ నగర్ పీఎస్లో పనిచేస్తున్న కిరణ్(36) మలక్ పేటలోని తన నివాసంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.