News December 24, 2024

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. పలు కారణాలతో చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News October 19, 2025

బాహుబలి ది ఎపిక్.. ఎనిమిదేళ్ల కిందటి ట్వీట్ వైరల్

image

బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించేందుకు ‘బాహుబలి ది ఎపిక్’ సిద్ధమవుతోంది. 2 భాగాలు కలిపి ఒకే పార్టుగా ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందట బిజినెస్‌మ్యాన్ నారాయణరావు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘బాహుబలి పార్ట్ 1&2 కలిపి ఓ సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. మళ్లీ తక్కువలో తక్కువ రూ.500 కోట్లు రాబట్టవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

News October 19, 2025

ఇస్రో షార్‌ 141 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇస్రో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ 141 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://www.isro.gov.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 19, 2025

దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

image

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దీపం జ్యోతి సాక్షాత్తూ దైవస్వరూపం. ఇది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును ఇస్తుంది. దీపం వల్లే మన కార్యాలన్నీ సుగమం అవుతాయి. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో.. వారే నిజమైన ఐశ్వర్యవంతులని పెద్దలు చెబుతారు.