News August 24, 2024

N కన్వెన్షన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు!

image

తమ్మిడి కుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కోరారు. కుంటకు తూర్పు భాగంలో FTL పరిధిలోనే నిర్మించడంతో చెరువులో నీరు ఉండే ప్రాంతం తగ్గిపోయిందని తెలిపారు. FTL మ్యాప్‌ను షేర్ చేస్తూ చెరువులోనే నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 4, 2026

రష్మిక మందన్న అరుదైన ఘనత

image

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఈ ఏడాది క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకకు ఆమె ప్రజెంటర్‌గా హాజరు కానున్నారు. ఈ అవార్డులకు భారత్ తరఫున హాజరైన ఏకైక నటి రష్మిక. 2024లో తొలిసారిగా ఈ వేడుకకు వెళ్లిన రష్మిక ఇప్పుడు మరోసారి ఛాన్స్ దక్కించుకున్నారు. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో ఈ అవార్డుల ఫంక్షన్ జరగనుంది. ఇందులో రష్మికతో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.

చెన్నైకి మరో ఓటమి

image

IPL-2026లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. ఇవాళ పంజాబ్‌తో జరిగిన మ్యాచులో 200+ స్కోర్ చేసినా గెలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 209/5 రన్స్ చేసింది. అనంతరం PBKSకు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (39), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ అయ్యర్ 50 (29), కనోలి 36(22) రన్స్ చేశారు. దీంతో ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ గెలుపొందింది. కాగా PBKSకు వరుసగా ఇది రెండో విజయం.