News June 19, 2024

జెస్సీరాజ్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

image

AP: వరల్డ్ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారిణి జెస్సీరాజ్‌కి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. మన విజయవాడకు చెందిన బాలిక ప్రపంచ స్థాయిలో భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయడం గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రతిభగల క్రీడాకారులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

వెండి భగభగలు.. కారణమిదే!

image

వెండి ధరలు ఆకాశాన్ని తాకడానికి చైనా నిర్ణయాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వెండి సరఫరాలో ఆధిపత్యం ఉన్న చైనా తన క్లీన్ ఎనర్జీ (సోలార్, EV) అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గడం, పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం KG వెండి ధర ₹3.40లక్షలు ఉండగా త్వరలోనే రూ.4లక్షలు క్రాస్ చేస్తుందని అంచనా.

News January 20, 2026

విద్యార్థులు రోగాల బారిన పడకుండా కమిటీలు

image

AP: హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా 9 శాఖల అధికారులతో జిల్లాల్లో JACలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్‌ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ‌, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాగా JACల తనిఖీలు నివేదికలకే పరిమితం కారాదని, లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

News January 20, 2026

ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>