News July 13, 2024

UK మాజీ పీఎంతో మంత్రి లోకేశ్ భేటీ

image

యూకే మాజీ PM టోనీ బ్లెయిర్‌తో సమావేశమైనట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘బ్రాహ్మణితో కలిసి ఈరోజు టోనీ బ్లెయిర్‌తో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. విద్య, ఆరోగ్యం, రాజకీయాలు వంటి రంగాల్లో AI ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చర్చించాం. ఆదాయాన్ని పెంపొందించడానికి దానిని ఎలా ఉపయోగించగలం అనేదానిపై మాట్లాడుకున్నాం’ అని ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

తమిళనాడు గవర్నర్ ‘హ్యాట్రిక్’ వాకౌట్!

image

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ సర్కార్ వార్ మరోసారి బయటపడింది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ RN రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళ గీతం తర్వాత జాతీయ గీతాన్ని కూడా ప్లే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అప్పావు నిరాకరించడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే బయటకు వెళ్లిపోయారు. ఇలా జరగడం ఇది వరుసగా మూడోసారి. 2024, 2025లో కూడా ఆయన ఇదే కారణంతో సభను బహిష్కరించారు.

News January 20, 2026

రాజేంద్రన్ గుండు కథ తెలుసా?

image

తమిళ నటుడు రాజేంద్రన్ గుండు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. స్టంట్‌మన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన 20 ఏళ్ల క్రితం బైక్‌పై నుంచి జంప్ చేస్తూ కెమికల్స్‌లో పడిపోయారు. అలర్జీలతో శాశ్వతంగా తన తల వెంట్రుకలతో పాటు కనుబొమ్మలు సైతం కోల్పోయారు. ఆ లుక్కునే తన ఐడెంటిటీగా మార్చుకున్నారు రాజేంద్రన్. పూర్తిగా గుండుతో పవర్‌ఫుల్ విలన్‌గా, కమెడియన్‌గా 500పైగా సినిమాల్లో నటించారు. ఎంతో ఇన్‌స్పిరేషన్ కదా!

News January 20, 2026

ఒకే రోజు రెండు భారత్-పాక్ మ్యాచ్‌లు

image

Feb 15న క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. భారత్-పాక్ జట్ల మధ్య ఆరోజు రెండు హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ICC మెన్స్ T20 వరల్డ్ కప్‌లో భాగంగా మెయిన్ టీమ్స్ తలపడనుండగా, అదే రోజు థాయ్‌లాండ్‌లో జరిగే ఉమెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-పాక్ ‘A’ జట్లు పోటీ పడతాయి. ఈ డబుల్ ధమాకా కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.