News October 28, 2024

టెస్లా CFOతో మంత్రి లోకేశ్ భేటీ.. పెట్టుబడులపై చర్చ

image

ఏపీలో పెట్టుబడులపై టెస్లా CFO వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. USలోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 72GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ లక్ష్యమని, దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపెనీ సహాయ, సహకారాలు అవసరమని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2026

22 ఏళ్లలో తొలిసారి.. PM స్పీచ్ లేకుండానే ధన్యవాద తీర్మానం పాస్

image

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. PM మోదీ స్పీచ్ లేకుండానే ఆమోదం తెలపడం గమనార్హం. ఇలా జరగడం 2004 తర్వాత ఇదే తొలిసారి. USతో ట్రేడ్ డీల్‌పై విపక్ష నేతల నిరసనలతో ప్రధాని ప్రసంగించకుండానే నిన్న లోక్‌సభ వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభమవగానే తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో నేడే కేంద్ర బడ్జెట్‌పై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.

News February 5, 2026

రాష్ట్రంలో 859 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

TG: జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్, జూ.అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. జాబును బట్టి 7వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయోపరిమితి 18-46 ఏళ్లు. ఈ నెల 13 వరకు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tshc.gov.in/

News February 5, 2026

రీప్రోగ్రామింగ్‌తో క్యాన్సర్ మటుమాయం!

image

క్యాన్సర్ కణాలను చంపడం కంటే వాటిని మళ్లీ సాధారణ కణాలుగా మార్చడమే సరైన మార్గమని సౌత్ కొరియా శాస్త్రవేత్తలు నిరూపించారు. MYB, HDAC2, FOXA2 అనే జన్యువులను నియంత్రించి పెద్దపేగు క్యాన్సర్ కణాలను తిరిగి ఆరోగ్యకరమైన కణాలుగా మార్చడంలో విజయం పొందారు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు లేకుండానే రీప్రోగ్రామింగ్ ద్వారా కణాల స్వభావాన్ని మార్చి ట్యూమర్లను తగ్గించవచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేల్చారు.