News July 16, 2024
విజయసాయి రెడ్డి ప్రెస్మీట్పై స్పందించిన మంత్రి లోకేశ్

AP: YCP MP విజయసాయి రెడ్డి నిన్నటి ప్రెస్మీట్లో వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. ఐదేళ్ల YCP పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 19, 2025
2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.
News November 19, 2025
ఈ గణపతి రూపం బాధలను పోగొడుతుంది

10 చేతులు, 5 తలలు గల హేరంబ గణపతిని దర్శిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణపతిని ధ్యానించిన తర్వాతే పరమ శివుడు త్రిపురాసురుడుని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఫలితంగానే స్వర్గంలో ఇంద్రుడు సహా త్రిమూర్తులు తమ స్థానాల్లో ఉండగలిగారట. అందుకే గణపతికి తొలి పూజలు చేస్తారు. ఈయనను కొలిస్తే.. శుభాలు కలుగుతాయని, సంసార సాగరాన్ని సునాయసంగా దాటేయగలరని పండితులు చెబుతున్నారు.
News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


