News August 30, 2024
పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు ప్రశ్నలు

AP: విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద స్కూల్ అని, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఐఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందారని లోకేశ్ గుర్తు చేశారు. సౌతాఫ్రికా అంటే ఏమిటి? నెల్సన్ మండేలా గురించి తెలుసా? అని విద్యార్థులకు ప్రశ్నలు వేశారు.
Similar News
News January 10, 2026
1275KGల చికెన్‌తో ‘బర్డ్ స్ట్రైక్స్’కు చెక్

రిపబ్లిక్ డే పరేడ్‌లో IAF విన్యాసాలకు పక్షులు అడ్డురాకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బర్డ్ స్ట్రైక్స్ ప్రమాదాల నివారణకు 1275KGల బోన్‌లెస్ చికెన్‌ను ఉపయోగించనుంది. గద్దలు, ఇతర పక్షులు ఎక్కువగా తిరిగే రెడ్ ఫోర్ట్, జామా మసీద్, మండీ హౌస్, ఢిల్లీ గేట్ సహా పలు ప్రదేశాల్లో ఈనెల 15-26 వరకు 2రోజులకు ఒకసారి తక్కువ ఎత్తు నుంచి మాంసాన్ని కిందికి వదులుతారు. దీంతో అవి తక్కువ ఎత్తులోనే తిరుగుతాయి.
News January 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 10, 2026
స్టార్ట్ కాకముందే విమర్శలా.. దీపిందర్ ఫైర్!

బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్ ‘టెంపుల్’పై వస్తున్న విమర్శలను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఖండించారు. ఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మార్కెట్లోకి రాకముందే దీనిని వాడొద్దని వైద్యులు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దీని వెనకున్న శాస్త్రీయ ఆధారాలను వెల్లడిస్తామని, అప్పటివరకు స్టార్టప్‌ల ప్రయత్నాలను ప్రోత్సహించాలని కోరారు. విమర్శలు చేసే ముందు వాస్తవాల కోసం వేచి చూడాలని ఆయన సూచించారు.


