News February 3, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ అజెండా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు <<18900983>>నోటీసులు<<>> జారీ చేయడంపై KTR తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ‘X’ వేదికగా మండిపడ్డారు. ఇందులో పస లేదని సుప్రీంకోర్టే కేసును కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దిగజారుడుకు నిదర్శనమన్నారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
News January 19, 2026
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: KTR

TG: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీశ్ రావును తప్పుడు కేసులతో <<18900983>>ఇబ్బంది<<>> పెడుతున్నారని KTR ఫైర్ అయ్యారు. ‘మాకు చట్టం, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఏ విచారణకైనా సిద్ధం. విచారణలు, నోటీసుల పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.
News January 19, 2026
ప్రభుత్వం గుడ్న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

AP: 2025-26 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.


