News November 4, 2024
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ

AP: అవసరమైతే తాను హోంమంత్రి పదవి చేపడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రి నారాయణ స్పందించారు. ఏ శాఖపైనైనా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించే అధికారం ఉంటుందని మంత్రి అన్నారు. పవన్ వ్యాఖ్యలను అలర్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్నచిన్న సమస్యలుంటే సీఎం సమన్వయం చేస్తారని నారాయణ అన్నారు.
Similar News
News December 10, 2025
బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
News December 10, 2025
సౌదీలో నాన్ ముస్లింలకు లిక్కర్ విక్రయాలు!

సౌదీలో నాన్ ముస్లింలు లిక్కర్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు 50వేల రియాల్స్(13,300డాలర్లు), అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మద్యం కొనే టైంలో శాలరీ స్లిప్ చూపించాలనే నిబంధన పెట్టనుందట. ప్రస్తుతం రాజధాని రియాద్లో దేశం మొత్తానికి ఒకే ఒక లిక్కర్ షాపు ఉంది. భవిష్యత్తులో మద్యం షాపుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.
News December 10, 2025
కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.


