News September 7, 2024
మున్నేరుకు వరద.. పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశం

TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరు నదికి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News November 29, 2025
సంగారెడ్డి: ఓపెన్ 10th, ఇంటర్ దరఖాస్తు గడువు పెంపు

ఓపెన్ 10th, ఇంటర్ అడ్మిషన్ గడువు అపరాధ రుసుముతో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి అపరాధ రుసుము రూ.100, ఇంటర్మీడియట్‌కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది అవకాశాన్ని అభ్యాసకులు వినియోగించుకోవాలన్నారు. అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశమన్నారు.
News November 29, 2025
మస్క్ ఆఫర్‌ను రిజక్ట్ చేసిన చైనా విద్యార్థులు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ xAI నుంచి వచ్చిన మల్టీ మిలియన్ డాలర్ ఆఫర్‌ను ఇద్దరు చైనా విద్యార్థులు విలియం చెన్, గువాన్ వాంగ్ తిరస్కరించారు. అత్యంత సామర్థ్యం ఉన్న OpenChat మోడల్‌ను అభివృద్ధి చేసి వీరు మస్క్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన ఆఫర్‌ను కాదని స్వయంగా సరికొత్త AIని రూపొందించేందుకు Sapient Intelligenceను స్థాపించి సక్సెస్ అయ్యారు.
News November 29, 2025
అప్పటికల్లా నక్సలిజం అంతం: అమిత్ షా

దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. రాయ్‌పూర్‌లో జరిగిన DGP, IGP సదస్సులో మాట్లాడారు. తదుపరి కాన్ఫరెన్స్ జరిగే నాటికి ముందే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఏడేళ్లుగా మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2014లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు 126 ఉండగా, ప్రస్తుతం 11కి తగ్గినట్లు వెల్లడించారు.


