News January 29, 2025
వైసీపీ నేతలకు మంత్రి పార్థసారథి సవాల్

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పార్థసారథి వైసీపీకి సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. వైసీపీ దోపిడీ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టారని మండిపడ్డారు. అలీబాబా 60 దొంగల్లా దోచుకున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి జగన్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.
Similar News
News November 4, 2025
స్టూడియో ఫ్లాట్స్‌కు పెరుగుతున్న డిమాండ్

విశాఖలో స్టూడియో ఫ్లాట్స్‌కు డిమాండ్ పెరుగుతోందని CREDAI తెలిపింది. టెక్ కంపెనీలు వస్తున్న వైజాగ్‌లో ఇలాంటి అపార్టుమెంట్లు 30 వరకు, అన్నీ ఫుల్ అయ్యాయని పేర్కొంది. 400-600Sft సైజులో లేటెస్ట్ ఫీచర్లతో లివింగ్, కిచెన్, బెడ్ రూం కలిపి ఉండేవే స్టూడియో ఫ్లాట్స్/సర్వీస్ అపార్ట్మెంట్స్. ప్రాజెక్టు పనులపై వచ్చే గెస్ట్ ఉద్యోగులు ఇంటి అనుభూతి కోరుకుంటే.. రోజులు-వారాల కోసం కంపెనీలు వీటిని అద్దెకు తీసుకుంటాయి.
News November 4, 2025
టీ/కాఫీ తాగకపోతే హెడేక్ ఎందుకు వస్తుందంటే?

అనుకోకుండా టీ/కాఫీ మానేస్తే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. దీనిపై డాక్టర్ సుధీర్ కుమార్ వివరణ ఇచ్చారు. ‘కాఫీ తాగకపోతే తలనొప్పి రావడం ఊహ కాదు. అది కెఫీన్ విత్‌డ్రాయల్ లక్షణం. అడెనోసిన్ అనే నిద్రమత్తు రసాయనాన్ని కెఫీన్ అడ్డుకుంటుంది. అకస్మాత్తుగా కాఫీ/టీ మానేస్తే అడెనోసిన్ మెదడులోకి వెళ్లి రక్తనాళాలు విస్తరిస్తాయి. దీంతో తలనొప్పి, అలసట, చిరాకు వంటివి కనిపిస్తాయి’ అని తెలిపారు.
News November 4, 2025
పిల్లలను జర్మనీకి పంపిస్తున్నారా?

జర్మనీకి వెళ్తే సెటిల్ అయిపోవచ్చని అనుకుంటున్న వారికి అక్కడి NRIలు కీలక సూచనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని ఉద్యోగాలు లేక చాలామంది వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ‘కేవలం ఇక్కడి NRIలు చేసే రీల్స్ చూసి గుడ్డిగా రావద్దు. కనీసం 10 మంది అభిప్రాయాలు తీసుకోండి. జర్మన్ భాష నేర్చుకోగలిగితే ఇక్కడ స్థిరపడటం సులభం. కష్టపడటానికి సిద్ధమైతేనే ఈ దేశాన్ని ఎంచుకోండి’ అని సూచిస్తున్నారు.


