News June 4, 2024
మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి చల్లా బాబు లీడింగులోకి వచ్చారు. రాజంపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా.. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Similar News
News September 8, 2025
ఫుడ్ డెలివరీ యాప్స్‌లో అధిక ధరలు.. నెట్టింట చర్చ!

రెస్టారెంట్ ధరలు, ఫుడ్ డెలివరీ యాప్ ధరలకు భారీ వ్యత్యాసం ఉండటంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గర్లోని రెస్టారెంట్ నుంచి స్విగ్గీలో ఆహారాన్ని బుక్ చేయాలనుకున్నాడు. అందులో రూ.1,473 ఛార్జ్ చేయడం చూసి అతడే స్వయంగా రెస్టారెంట్‌కు వెళ్లి రూ.810కే తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని Xలో లేవనెత్తడంతో తామూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నామని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మీకూ ఇలానే జరిగిందా?
News September 8, 2025
మధ్యాహ్నం 2గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
News September 8, 2025
అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.