News September 21, 2024
ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రి పొంగులేటి భేటీ

TG: రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు. మ.2గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి రెవెన్యూ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పెండింగ్ పదోన్నతులు, ఎన్నికల బదిలీలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Similar News
News September 17, 2025
విలీనం కాకపోతే TG మరో పాక్లా మారేది: బండి

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్ను మించి పరకాల, బైరాన్పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
News September 17, 2025
వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.
News September 17, 2025
NVS రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏమంటోంది..?

NVS రెడ్డిని HMRL MD పదవి నుంచి తప్పించారనే వాదనను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్పోర్ట్)గా ఆయన సేవలు ఎక్కువ వినియోగించుకునేలా ప్రమోట్ చేసిందని చెబుతున్నాయి. గతంలో GHMC ట్రాఫిక్ కమిషనర్ లాంటి బాధ్యతలతో పట్టణ రవాణాలో NVSకు అపార అనుభవముంది. ఫోర్త్ సిటీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆయన నైపుణ్యాలు వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాయి.