News November 3, 2024
బండి సంజయ్‌కి మంత్రి పొన్నం కౌంటర్

TG: కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ప్రభాకర్ Xలో కౌంటర్ ఇచ్చారు. రైతులకు పింఛన్, 2 కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లలో రూ.15 లక్షలు ఇలా BJP ఎగ్గొట్టిన హామీలు చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని దుయ్యబట్టారు.10 నెలల ప్రజా ప్రభుత్వంపై సంజయ్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని హితవు పలికారు.
Similar News
News January 22, 2026
క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై పరిమితి విధించాలి: పురందీశ్వరి

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాలని BJP MP పురందీశ్వరి కోరారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు RBI మార్గదర్శకాలకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చారు. భారత్‌లో 24-48%, కొన్ని చోట్ల 55%+ వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ విధిస్తున్నారని, USలో వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేశారని గుర్తుచేశారు.
News January 22, 2026
భారత్ అంత చేసినా.. బరితెగించిన బంగ్లా!

భారత్‌లో T20 WC ఆడబోమన్న బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించిందే BCCI. 1988లో BCBకి అప్పటి ICC ఛైర్మన్ జగ్మోహన్ దాల్మియా ICCలో సభ్యత్వం ఇప్పించారు. తర్వాత BCCI ఆ జట్టుకు టెస్ట్ హోదా లభించేలా చేసింది. ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాను స్వతంత్ర దేశంగా చేసిందే భారత్. బంగ్లా తీరుపై మీరేమంటారు?
News January 22, 2026
ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.


