News October 4, 2024

ఆ జిల్లా పేరు మార్చాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

image

AP: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాశారు. జిల్లాకు కడప అని పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కడపలోని వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారన్నారు. అవగాహనా రాహిత్యంతో వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 22, 2026

తీవ్ర విషాదం.. పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

image

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెళ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు బాడీలను ఫ్యామిలీకి అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2026

రాత్రి పూట తలస్నానం చేయకూడదా?

image

చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయం విశ్రాంతికి సంకేతం. అప్పుడు చన్నీటి స్నానంతో శరీరాన్ని అధికంగా చల్లబరిస్తే అనారోగ్యాలు వస్తాయని వద్దంటారు పండితులు. డాక్టర్లు సైతం ఇది మంచిది కాదంటున్నారు. ‘రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు. దానివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. అయినా తలస్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. తల ఆరడానికి సమయం పడుతుంది. దీంతో తలనొప్పి, సైనస్ రావొచ్చు’ అంటున్నారు.

News February 22, 2026

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

image

హీరోయిన్ సాయిపల్లవి అరుదైన ఘనత సాధించారు. పదేళ్ల వ్యవధిలో 3 భాషల్లో ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్న నటిగా నిలిచారు. 2015లో ప్రేమమ్(మలయాళం) చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగులో ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, తమిళంలో గార్గి, అమరన్(లేటెస్ట్) సినిమాలకు ఉత్తమ నటిగా, విరాటపర్వం మూవీకి ఉత్తమ నటి(క్రిటిక్స్) పురస్కారాలు పొందారు.