News January 20, 2025
లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం

AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్‌లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News December 27, 2025
చలికాలంలో పెరుగుతో జలుబు చేస్తుందా?

చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందనేది అపోహ అని వైద్యులు చెబుతున్నారు. ‘పెరుగుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మందగించే జీర్ణక్రియకు చెక్ పెట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే అందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని అంటున్నారు. అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన పెరుగును వెంటనే తినొద్దని సూచిస్తున్నారు.
News December 27, 2025
ధనుర్మాసం: పన్నెండో రోజు కీర్తన

‘లేగదూడలను తలచుకొని గేదెలు కురిపించే పాలధారలతో వాకిళ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇంతటి ఐశ్వర్యం కలిగిన గోపాలుని సోదరీ! బయట మంచు కురుస్తున్నా, మేమంతా వేచి ఉన్నాము. శ్రీరాముడు ఆనాడు రావణుడిని సంహరించిన వీరగాథలను మేమంతా భక్తితో పాడుతున్నాము. ఇంత జరుగుతున్నా నీవు మాత్రం నిద్ర వీడటం లేదు. నీ భక్తి పారవశ్యం మాకు అర్థమైంది. ఇకనైనా ఆ నిద్ర చాలించి, మాతో కలిసి ఆ మాధవుని సేవలో పాల్గొనవమ్మా!’ <<-se>>#DHANURMASAM<<>>
News December 27, 2025
H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్‌మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.


